Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీదేవి ఆకస్మిక మృతితో జూనియర్ ఎన్టీఆర్ తీరని కోరిక!

  • శ్రీదేవి అంటే తారక్ కు వల్లమాలిన అభిమానం
  • ఆమె నా కలల హీరోయిన్
  • ఆమెతో ఒక్క పాటైనా చేయాలి
ప్రముఖ సినీ నటి శ్రీదేవి ఆకస్మిక మృతితో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కోరిక తీరకుండా ఉండిపోయింది. ఆమె మరణం నేపథ్యంలో ఆమెతో ఉన్న పరిచయం, ఆమె పట్ల ఉన్న గౌరవ మర్యాదలు, ఆమె కీర్తి ప్రతిష్ఠల గురించి అంతా మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తీరని కోరిక వివరాల్లోకి వెళ్తే... శ్రీదేవికి ఎంతో మంది అభిమానులు, వారిలో యంగ్ టైగర్ కూడా ఒకరు. తాతగారి సినిమాలు చూస్తూ స్పూర్తి పొంది నటుడైన జూనియర్ ఎన్టీఆర్ ను శ్రీదేవి కూడా ఆకర్షించారు. ఆమె అంటే ఆయనకు ఎంతో అభిమానం. ఈ విషయాన్ని తారక్ ఎన్నో సందర్భాల్లో వెల్లడించాడు కూడా.

గతంలో ‘‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’’లో పాల్గొన్న సందర్భంగా ఆమెపై అభిమానాన్ని చాటుకుంటూ, శ్రీదేవి అంటే తనకు పిచ్చి అని జూనియర్ పేర్కొన్నాడు. ఆమె తన కలల హీరోయిన్ అని చెప్పాడు. ఆమెకు ఇప్పటి నటీమణులెవ్వరూ సాటి రారని చెప్పాడు. ఆమె గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఒక మాట, ఒక భార్య, ఒక బాణం అని చెప్పినట్టు సినీ నటి అంటే ఆమె మాత్రమే అనేలా తన మైండ్‌ లో ఫిక్స్‌ అయిపోయిందని అన్నాడు.

ఆమె హీరోయిన్‌ గా చేయడానికి రెడీ అంటే ఆమెతో కలిసి నటించేందుకు తాను కూడా రెడీ అని ఆసక్తి ప్రదర్శించాడు. అయితే ఆమె తనతో చేయరని చెప్పాడు. ఎక్కడో ఒకచోట ట్రై చేసి, ఆమెను కనీసం ఒక్క పాటలో అయినా తనతో నటించేందుకు ఒప్పించాలి...చాలా కష్టమైనప్పటికీ శక్తిమేరకు కృషిచేస్తానని అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు. 
jr ntr
sridevi
Talking Movies

More Telugu News